తెలుగులో డ‌బ్బింగ్ చెప్పిన అదితి.. వీడియో వైర‌ల్‌

Fri,June 8, 2018 01:58 PM
Aditi Rao Hydari Dubbing For Sammohanam

టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలో దశాబ్ధంకి పైగా సినిమాలు చేస్తున్న కాజ‌ల్ లాంటి భామ‌లు తెలుగు నేర్చుకునేందుకు ఆస‌క్తి చూప‌క‌పోయిన‌, ఇప్పుడొస్తున్న ప‌క్క రాష్ట్ర భామ‌లు మాత్రం తొలి సినిమాలోనే తెలుగు డ‌బ్బింగ్ చెబుతున్నారు. ఇది ఓ ర‌కంగా శుభ‌ప‌రిణామం అని చెప్ప‌వ‌చ్చు. ప‌రాయి రాష్ట్ర భామ‌లు అయిన‌ ర‌కుల్ ప్రీత్ సింగ్‌, స‌మంత‌, కీర్తి సురేష్ , అను ఎమ్మాన్యుయేల్‌, షాలిని పాండే త‌దిత‌రులు రీసెంట్ చిత్రాల‌లో వారి పాత్ర‌ల‌కి వారే డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. తాజాగా ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న స‌మ్మోహ‌నం సినిమా కోసం అదితి రావు హైద‌రి డ‌బ్బింగ్ చెప్పుకుంది. ముద్దుగా ముద్దుగా తెలుగు మాట్లాడుతూ అల‌రిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని చిత్ర యూనిట్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసింది. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

సుధీర్ బాబు .. అదితీ రావు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మోహనకృష్ణ ఇంద్రగంటి తెర‌కెక్కించిన చిత్రం సమ్మోహనం . జూన్ 15న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల‌ 10న ఫిలిం న‌గ‌ర్ జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ హాల్‌లో జ‌ర‌గ‌నుంది . ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా మ‌హేష్ బాబు హాజ‌రు కానున్నాడు. శ్రీదేవి మూవీస్ బేన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు. అదితి రావు హైద‌రి స‌మ్మాహ‌నం చిత్రంతో టాలీవుడ్‌కి డెబ్యూ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. చెలియా అనే డ‌బ్బింగ్ చిత్రంతో ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మే.

3150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles