తెలుగులో అందంగా పాట పాడిన అదితి రావు

Sat,June 23, 2018 04:04 PM
Aditi Rao Hydari Enjoying The Success Of Sammohanam

మణిరత్నం తెరకెక్కించిన చెలియా అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అందాల భామ అదితిరావు హైదరి. అసమాన అభినయనంతో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టే ఈ అమ్మడు సమ్మోహనం అనే చిత్రంతో తెలుగులోకి డెబ్యూ ఇచ్చింది. చిత్రంలో అదితిరావు హైదరి నటనకి మంచి మార్కులు పడ్డాయి. సమ్మోహనం మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ని మాల్దీవులలో జరుపుకుంటుంది. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సమ్మోహనం సినిమాలోని ఓ చెలి తార సాంగ్ ని పాడి తన ట్విట్టర్ లో షేర్ చేసింది. అదితి పాడిన పాటకి నెటిజన్స్ ఫిదా కావడమే కాక ఆ వీడియోని వైరల్ చేసేశారు. అదితి గాత్రం చాలా బాగుందంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. సమ్మోహనం హిట్ తో మహేష్ 25వ చిత్రంలో ప్రత్యేక పాత్ర కోసం అదితిని సెలక్ట్ చేశారని ఇన్ సైడ్ టాక్.2734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles