రవితేజ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ..!

Sun,July 14, 2019 10:00 AM

మాస్ మ‌హరాజా ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కోరాజా చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. సెప్టెంబ‌ర్ నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో రవితేజ‌తో పాటు మ‌రో హీరో కూడా న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక క‌థానాయిక‌గా అదితి రావు హైద‌రిని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. స‌మ్మోహ‌నం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈ అమ్మ‌డు మ‌ణిరత్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చెలియా, న‌వాబ్ చిత్రాల‌తో మ‌రింత ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం నాని 25వ చిత్రం వి లో క‌థానాయిక‌గా న‌టిస్తుంది అదితి. ర‌వితేజ‌తో తొలిసారి న‌టించ‌నున్న అదితి తెలుగులో ఈ చిత్రంతో మ‌రిన్ని ఆఫర్స్ పొందాల‌ని భావిస్తుంద‌ట‌.

1814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles