మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలో నాని స‌ర‌స‌న అదితి..!

Wed,March 13, 2019 11:11 AM
Aditi Rao Hydari paired with nani

ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న నాని ప్ర‌స్తుతం రెండు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. గౌత‌మ్ తిన్న‌నూరి దర్శ‌క‌త్వంలో జెర్సీ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీతో పాటు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే సినిమా చేయ‌నున్నాడు. ఈ రెండు చిత్రాలు 2019లోనే విడుద‌ల కానున్నాయి. ఇక త‌నని అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేసిన ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలోను నాని ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం మ‌ల్టీ స్టార‌ర్ మూవీగా రూపొంద‌నుండ‌గా ఇందులో సుధీర్ బాబు కూడా మ‌రో ప్ర‌ధాన పాత్ర పోషిస్తాడ‌ట‌. ఇక క‌థానాయిక‌గా నాని స‌ర‌స‌న అదితిరావుని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంద్ర‌గంటి తెర‌కెక్కించిన ‘సమ్మోహనం’లో సుధీర్ బాబు, అదితి రావు హైద‌రి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. వారిద్ద‌రిని ఇప్పుడు మ‌ళ్ళీ త‌న ప్రాజెక్ట్‌లో తీసుకుంటున్నాడ‌ట ఇంద్ర‌గంటి. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రంకి సంబంధించి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. నాని న‌టించిన చివ‌రి మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం దేవ‌దాస్ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో నానితో పాటు నాగార్జున ప్ర‌ధాన పాత్రలు పోషించారు.

1924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles