ఆదిత్యదార్.. హౌ ఈజ్ ద జోష్‌

Fri,August 9, 2019 05:59 PM
Aditya Dhar wins Best Director Award for Uri film

హైద‌రాబాద్‌: యురి ద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్‌. పాకిస్థాన్‌లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త ఆర్మీ చేసిన దాడి నేప‌థ్యంతో రూపొందిచ‌న చిత్రం ఇది. ఈ సినిమాను ఆదిత్య‌దార్ డైర‌క్ట్ చేశాడు. 130 కోట్ల మంది భార‌తీయుల ఉద్వేగాన్ని ఈ చిత్రంలో చూపించాడ‌త‌ను. విక్కీ కౌశ‌ల్ హీరోగా న‌టించిన ఈ సినిమా ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో ఓ కొత్త వ‌ర‌వ‌డిని సృష్టించింది. హాలీవుడ్ స్ట‌యిల్‌లో ఓ వార్ మూవీని తీయ‌డం బ‌హుశా ఇదే మొద‌టిసారి అన్న ఆశ్చ‌ర్యం లేదు. తొలి ఫ్రేమ్ నుంచే డైర‌క్ట‌ర్ ఆదిత్య‌దార్‌.. త‌న క‌థా శైలితో స‌ర్జిక‌ల్ దాడి చేశాడు. మ‌య‌న్మార్ బోర్డ‌ర్‌లోని మ‌ణిపూర్‌లో ఆర్మీపై స్థానిక మిలిటెంట్లు దాడి చేస్తారు. అయితే ఆ మిలిటెంట్ల‌పై భార‌త ఆర్మీ ప్ర‌తిదాడి చేసి చంపేస్తుంది.


ఇక ఆ సీన్ నుంచి టేకాఫ్ తీసుకుంటుంది యురి ద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్‌. ఆ త‌ర్వాత ఒక సీన్ కూడా మ‌న‌ల్ని నిరాశ‌ప‌ర‌చ‌దు. దేశ‌భ‌క్తిని ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ చూపిస్తూనే.. ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగుల్నీ డైర‌క్ట‌ర్ ఆదిత్య‌దార్ త‌న ఫిల్మ్‌లో ప్ర‌జెంట్ చేశాడు. క‌శ్మీర్‌లోని యురి సెక్టార్‌లో ఉన్న ఆర్మీ పోస్టుపై పాక్ ఉగ్ర‌వాదులు ఆక‌స్మిక దాడి చేస్తారు. అయితే ఆ దాడిలో 17 మంది సైనికులు చ‌నిపోతారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన భార‌త ఆర్మీ ప్ర‌తిదాడికి ప్లాన్ చేస్తుంది. ఓ ర‌హ‌స్య ఆప‌రేష‌న్‌తో శ‌త్రు స్థావ‌రాల‌పై దాడి చేస్తుంది. ఆ ప్లాన్‌కు ఓ కెప్టెన్‌ను ఎన్నుకుంటారు. మేజ‌ర్ విహాన్ సింగ్ షేర్గిల్‌ పాత్ర‌నే హీరో విక్కీ కౌశ‌ల్ పోషించాడు. కొంత మంది టీమ్‌తో మేజ‌ర్ విహాన్ పాక్ ఉగ్ర‌స్థావ‌రాల‌పై దాడి చేస్తాడు.

మూవీలో ఉన్న టెన్ష‌న్‌ను మొత్తం త‌న పాత్ర‌లో ప్ర‌ద‌ర్శించాడు విక్కీ. ఆ స‌న్నివేశాల‌ను డైర‌క్ట‌ర్ ఆదిత్య‌దార్ అద్భుతంగా చిత్రీక‌రించాడు. క‌థా గ‌మ‌నాన్ని ఎక్క‌డా స్లో చేయ‌లేదు. హై టెన్ష‌న్‌లోనే సినిమా స్పీడ్‌గా వెళ్తుంది. హాలీవుడ్ రేంజ్‌లో మేకింగ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ఓ ప్ర‌త్యేక‌త‌. హాలీవుడ్ వార్ మూవీల త‌ర‌హాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో త‌న తోటి టీమ్ వారిని ఉత్సాహాప‌రిచేందుకు కొట్టిన డైలాగే హౌ ఈజ్ ద జోష్‌. ఈ డైలాగ్ యావ‌త్ దేశాన్ని ఊపేసింది. సినిమా చూపిన ప్ర‌తి ప్రేక్ష‌కుడు ఈ డైలాగ్‌తో భావోద్వేగాల‌కు గుర‌య్యారు. బెస్ట్ సౌండ్ డిజైన్‌లోనూ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ అవార్డు కొట్టిడం విశేషం. ఆదిత్య‌ధార్ తీసిన స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్ బాక్సాఫీసు వ‌ద్ద కూడా భారీ వ‌సూళ్లు కురిపించింది.

1369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles