2 స్టేట్స్ రీమేక్‌లో బాహుబ‌లి చిత్ర‌ న‌టుడు

Wed,January 3, 2018 11:32 AM
adivi sesh plays lead role in 2 states remake

ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘2 స్టేట్స్‌’ (2014) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ మళ్లీ చూడదగ్గ సినిమా ఇది అని విశ్లేషకులు, సినీ ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గీయులు ప్రశంసించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్‌ కానుంది. కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్, సాజిద్‌ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్ హిందీ చిత్రాన్ని నిర్మించాయి. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్‌ కుంచెమ్‌.. వినాయక్‌ సహకారంతో ఈ చిత్రం తెలుగు రీమేక్‌ హక్కులు దక్కించుకున్నారు.

విశేషం ఏంటంటే.. హిందీ చిత్రానికి ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరించిన ధర్మ ప్రొడక్షన్స్‌ ఇప్పటివరకూ తమ సంస్థ నిర్మించిన ఏ చిత్రం రీమేక్‌ హక్కులను దక్షిణాదికి ఇవ్వలేదు. తొలిసారి ఈ సంస్థ రీమేక్‌ హక్కులను అమ్మిన చిత్రం ‘2 స్టేట్స్‌’. పంపిణీ రంగంలో పలు విజయాలు చూసిన అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటున్న అభిషేక్‌ దష్టికి వెంకట్‌ కుంచెమ్‌ ఈ ‘2 స్టేట్స్‌’ని తీసుకెళ్లారు. మంచి కథాంశంతో రూపొందించిన చిత్రం కావడం, హిందీలో ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి అభిషేక్‌ ముందుకొచ్చారు. బాహుబ‌లి ది బిగినింగ్‌లో త‌న న‌ట‌న‌తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన న‌టుడు, ఫిలిం మేక‌ర్ అడివి శేషు ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడ‌ట‌.మిగ‌తా న‌టీన‌టుల వివరాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

1997
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles