మరో హిట్‌పై కన్నేసిన అడవి శేషు

Fri,November 4, 2016 01:17 PM

కర్మ మూవీతో యాక్టింగ్ కెరీర్‌ని స్టార్ చేసి, పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు అడవి శేషు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో భద్ర అనే క్యారెక్టర్‌లో కనిపించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత క్షణం అనే చిత్రంలో హీరోగా నటించి మంచి సక్సెస్‌ని తన పాకెట్‌లో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై గూడాచారి అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు. రాహుల్ పకల మరియు శశి కిరణ్ దర్శకత్వంలో రూపొందనున్న గూడాచారి చిత్రంలో శోభిత దులిపాల కథానాయికగా నటించనుంది. ఈ చిత్రంలో అడివి శేషు పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందట. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

2467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles