అకీరాతో అడ‌వి శేష్ సెల్ఫీ.. వైర‌ల్‌గా మారిన ఫోటోస్

Tue,August 27, 2019 09:16 AM

ప‌వ‌న్ క‌ళ్యాణ్, రేణుదేశాయ్‌ల త‌న‌యుడు అకీరాని త్వ‌ర‌లో వెండితెర‌పై చూడాల‌ని అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు. రేణూ మాత్రం త‌న కొడుకుని సినిమాల‌కి దూరంగా ఉంచుతాన‌ని అంటుంది. అయితే అప్పుడప్పుడు అకీరా ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో వాటిని చూసి మెగా అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తుంటారు. తాజాగా అడ‌వి శేష్ త‌న ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరాతో దిగిన ఫోటోల‌ని షేర్ చేశాడు. ఇవి కాస్త వైర‌ల్ అయ్యాయి.

రీసెంట్‌గా ఎవ‌రు సినిమాతో మంచి హిట్ కొట్టిన అడ‌వి శేష్ .. రేణు దేశాయ్, అకీరా, ఆద్యలని వారి నివాసంలో కలుసుకున్నట్లు త‌న ట్విట్ట‌ర్ ద్వారా వివరించాడు. ఈ సందర్భంగా అకీరా గురించి శేష్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. అందమైన కుర్రాడు అకీరాతో ఈ రోజు గడిపా. అకీరాకు ఎవరు చిత్రం చాలా బాగా నచ్చింది. లంచ్ స‌మ‌యంలో అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అకీరా వాయిస్ చాలా గంభీరంగా ఉంది. అకీరా పొడవు 6 అడుగుల 4 అంగుళాలు. మేమిద్దరం ఎడమచేతి వాటం కలిగిన వాళ్ళం. అంతే కాదు మా ఇద్దరిలో అనేక కామన్ విషయాలు ఉన్నాయి అని అకిరా గురించి శేష్ చెప్పుకొచ్చాడు.ఆద్యకి కొంచెం సిగ్గు ఎక్కువ‌. కెమెరా ముందు భ‌య‌ప‌డుతుంటుంది అని అన్నాడు శేషు


ఇక రేణు దేశాయ్ గురించి ఆయన స్పందిస్తూ.. ఆమెలో అద్భుతమైన రచయిత దాగుందని ప్రశంసలు గుప్పించాడు అడవి శేష్. ఈ సందర్బంగా రేణు దేశాయ్, అకీరాతో కలసి దిగిన సెల్ఫీలు అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles