ర‌జ‌నీకాంత్ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ మొద‌లు..!

Sat,August 31, 2019 12:21 PM

శంకర్ విజువ‌ల్ వండ‌ర్ 2.0 చిత్రం ఇక్కడ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం చైనాలోను విడుద‌లయ్యేందుకు రంగం సిద్దం చేసుకుంది. జూలై 12న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు హెచ్ వై మీడియా అనే డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ గ‌తంలో ప్ర‌క‌టించింది. కాని డిస్నీసంస్థ నుండి వ‌చ్చిన ద ల‌య‌న్ కింగ్ అనే చిత్రం హై విజువల్స్ తో జులై 19న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ నేప‌థ్యంలో 2.0 చిత్రాన్ని వాయిదా వేసారు. ఇటీవ‌ల‌ కొత్త డేట్ అనౌన్స్ చేశారు. 3డీలో 47 వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 6న‌ విడుద‌ల కానుండ‌గా, ఓ విదేశీయ చిత్రం 3డీ ఫార్మాట్‌లో ఇంత భారీ సంఖ్య‌లో విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి.


చైనాలో ఈ చిత్రం 'బాలీవుడ్ రోబో 2.0: రిస‌ర్జెన్స్' అనే టైటిల్‌తో విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో చైనాలో విడుద‌లైన బాహుబ‌లి 2 చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించిన సంగ‌తి తెలిసిందే. 2.0 చిత్రాన్ని 10 వేల థియేట‌ర్స్ ( 56 వేల స్క్రీన్స్‌లో ) విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు లైకా గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది . కాగా ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారట. నేటి నుండి ఆన్ లైన్‌లో 2.0 టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. రజనీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న దర్బార్ మూవీ వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

2079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles