అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీతో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్

Tue,January 22, 2019 08:21 AM

రాజ‌మౌళి సినిమాలంటే ఎంత రిచ్‌గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌తి సినిమాలో ఏదో ఒక కొత్త ద‌నం చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంటాడు. బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా ప్ర‌తిష్ట‌ను ఖండాంత‌రాలు దాటించిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ ( వ‌ర్కింగ్ టైటిల్ ) అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా, రీసెంట్‌గా ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీ కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడుతున్న‌ట్టు సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్ కుమార్ తెలియ‌జేశారు. అర్రీ అలెక్సా ఎల్ ఎఫ్‌తో పాటు సిగ్నేచ‌ర్ ప్రైమ్ లెన్స్‌తో స‌న్నివేశాల‌ని అద్భుతంగా తెర‌కెక్కించొచ్చు అని ఆయ‌న అన్నారు. ఈ లెన్స్ వ‌ల‌న స‌హ‌జ‌సిద్ధంగా స‌న్నివేశాల‌ని షూట్ చేసే అవ‌కాశం ఉంద‌ని సెంథిల్ పేర్కొన్నారు. 360 డిగ్రీస్‌లో కూడా సీన్స్ తీసే అవ‌కాశం ఈ లెన్స్ వ‌ల‌న ఉంటుంద‌ట‌. ఇండియన్‌ సినిమాల్లో ఇంతవరకు వాడని టెక్నాలజీని వాడుతున్నట్లు కెమెరామెన్‌ సెంథిల్‌కుమార్ స్ప‌ష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న విష‌యం విదిత‌మే.1585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles