మీమ్స్‌తో 'కళంక్' రివ్యూ

Thu,April 18, 2019 03:13 PM
After Watching Kalank people reacted with Hilarious Memes

ఇది సోషల్ మీడియా యుగం బాస్. ఇంకా ఆ పాతకాలం ట్రెడిషనల్ మీడియాను పట్టుకొని వేలాడితే ఎలా. అప్‌డేట్ అవ్వాలి. సోషల్ మీడియా అంటేనే మనకు గుర్తొచ్చేది హాష్‌టాగ్స్, మీమ్స్, చాలెంజెస్. ఇదంతా వర్చువల్ వరల్డ్. నేటి తరానికి ఆ ప్రపంచమే ఇష్టం. నిజమైన ప్రపంచం బోర్. ఏదైనా షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాలనుకుంటారు. వెయ్యి పదాల కన్నా ఒక్క ఫోటో మిన్న అంటారు కదా. దాన్నే సోషల్ మీడియాలో అన్వయించుకుంటే మీమ్స్. ఒక్క మీమ్‌తో ఎంతో చెప్పేయొచ్చు. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, ఫన్నీగా, వెరైటీగా చెప్పగలిగే అవకాశం ఒక్క మీమ్స్ ద్వారానే.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ ఏదంటే.. కళంక్ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా నిన్న రిలీజ్ అయిన ఈ సినిమానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. నెటిజన్లు కళంక్ రివ్యూ హాష్‌టాగ్‌తో మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంతమంది కళంక్ సినిమాపై పాజిటివ్ మీమ్స్ క్రియేట్ చేయగా.. మరికొందరు మాత్రం నెగెటివ్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

సంజయ్ దత్, మాధురి దీక్షిత్, అలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యరాయ్ కపూర్ లాంటి హేమాహేమీలు న‌టించిన‌ సినిమా కావడం, కరణ్ జోహార్ కలల ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమాపై సినీ అభిమానులంతా తెగ ఆసక్తి చూపించారు.


1893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles