పాక్ న‌టీన‌టుల‌ని బ్యాన్ చేయండి.. మోదీకి లేఖ‌

Sat,August 10, 2019 08:50 AM
AICWA writes letter to PM Narendra Modi

క‌శ్మీర్‌కి ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి క‌లిగించే ఉద్ధేశంతో మోదీ ప్ర‌భుత్తం ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్టిక‌ల్ 370 ర‌ద్ధు కార‌ణంగా పాక్ ప్ర‌భుత్వం మ‌న సినిమాల‌ని పాక్‌లో నిషేదించింది. ఈ నేప‌థ్యంలో ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (ఏఐసీడబ్ల్యూఏ) పాక్ న‌టీన‌టులని భార‌త్ సినిమాల‌లో న‌టించ‌కుండా చూడాలని ప్ర‌ధానిని కోరింది. పాకిస్థాన్ ప్ర‌భుత్వం భార‌త సినిమాల‌ని నిషేదించిన క్ర‌మంలో మ‌నం కూడా పాక్‌కి సంబంధించిన ఆర్టిస్టులు, సంగీత క‌ళాకారులు, దౌత్యవేత్తలపై నిషేధం విధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్‌ చేస్తోంది. వారిని నిషేదించే వ‌ర‌కు మొత్తం చిత్ర పరిశ్రమ, సినీ కార్మికులు తిరిగి పనులు మొదలుపెట్టరు అని ఏఐసీడబ్ల్యూఏ త‌మ‌ లేఖలో పేర్కొంది. మ‌రి దీనిపై మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.


2048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles