ఆర్ఆర్ఆర్ చిత్రానికి అజ‌య్ దేవ‌గ‌ణ్ రెమ్యున‌రేష‌న్ ?

Wed,September 18, 2019 11:10 AM

టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించిన చారిత్రాత్మ‌క చిత్రం బాహుబ‌లి. ఈ ఫ్రాంచైజ్‌లో వ‌చ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. ఇక ఇప్పుడు మ‌రో చారిత్రాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్ భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుండ‌గా రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో సంద‌డి చేయ‌నుండ‌గా, ఎన్టీఆర్ కొమురం భీంగా అల‌రించ‌నున్నాడు. అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త అభిమానుల‌కి షాక్ ఇస్తుంది.


ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న చ‌ర‌ణ్‌కి తండ్రిగా కనిపించ‌నున్నాడ‌ట‌. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ పాత్ర ఉంటుంద‌ని స‌మాచారం. ఈ చిత్రానికి గాను అజ‌య్‌కి 30 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసార‌ని టాక్. త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని మ‌రో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భ‌ట్.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సౌత్‌, నార్త్ టాప్ స్టార్స్ చిత్రంలో భాగం కావ‌డంతో ఈ సినిమాకి దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భించ‌నుంది. జూలై 30,2020న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles