'ఏకే 47' బాల‌య్య కోసం కాద‌ట‌

Fri,June 15, 2018 08:49 AM
Ak 47 title not for bala krishna movie

నంద‌మూరి బాల‌కృష్ణ- వివి వినాయ‌క్ కాంబినేష‌న్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 16 సంవ‌త్స‌రాల క్రితం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చెన్నకేశ‌వ‌రెడ్డి చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో ఈ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో బాల‌య్య 104వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి ఏకే 47 అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై చిత్ర నిర్మాత సి. క‌ళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఫిలిం చాంబ‌ర్‌లో ఏకే 47 అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించాము కాని, అది బాల‌య్య సినిమా కోసం కాదు. మా బేన‌ర్‌లో తెర‌కెక్క‌బోవు త‌దుప‌రి సినిమా కోసం ఆ టైటిల్ వాడ‌నున్న‌ట్టు క‌ళ్యాణ్ వివ‌రించారు. ఇక ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ‌ని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఈ సినిమా త‌ర్వాత బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న బాల‌య్య వ‌చ్చే ఏడాది త‌న తండ్రి బ‌యోపిక్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. ఈ చిత్రంలో 64 పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు . క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొందుతుంది.

2581
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles