బాల‌య్య‌- వివి వినాయ‌క్ సినిమాకి ఆస‌క్తిక‌ర టైటిల్‌

Thu,June 14, 2018 10:32 AM
ak 47 title refereed for balayya movie

నంద‌మూరి బాల‌కృష్ణ జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. త‌న తండ్రి బ‌యోపిక్ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన బాల‌య్య వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ బయోపిక్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది. అయితే ఈ లోపు రెండు సినిమాల‌ని లైన్‌లో పెట్టాడు నంద‌మూరి హీరో . వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న బాల‌య్య‌, బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రం చేయ‌నున్నాడు.

బాల‌య్య‌- వినాయ‌క్ కాంబినేష‌న్‌లో వచ్చిన చెన్నకేశ‌వ‌రెడ్డి చిత్రం సూప‌ర్ హిట్ కావ‌డంతో ఈ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. బాల‌య్య 104వ చిత్రంగా సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై సీ క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సాగ‌నున్న ఈ చిత్రంలో శ్రియ‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు టాక్‌. ఇక ఈ మూవీకి ఏకే 47 అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో అభిమానుల‌కి న‌చ్చేలా బాల‌య్య 104వ చిత్రాన్ని వివి వినాయ‌క్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

3262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles