ఆకాశ‌వాణి చిత్రం హాలీవుడ్ చిత్రానికి కాపీనా ?

Mon,April 22, 2019 01:23 PM
Akashavani movie copies to hollywood moive

సోష‌ల్ మీడియాకి ఆద‌ర‌ణ మ‌రింత పెర‌గ‌డం వ‌ల‌న నిజాల‌ని నిక్క‌చ్చిగే చెప్పే అవ‌కాశం ప్ర‌తి ఒక్క‌రికి ల‌భిస్తుంది. సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటు సౌత్ చిత్రాలైన‌, అటు నార్త్ మూవీస్ అయిన ఇంగ్లీష్ మూవీస్‌కి కాపీ అనిపిస్తే వెంట‌నే ఆ విష‌యాన్ని సామాజిక మాధ్య‌మాల‌లో ప్రూఫ్‌ల‌తో స‌హా షేర్ చేస్తున్నారు. తాజాగా ఎస్ఎస్ రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మిస్తున్న ఆకాశ‌వాణి చిత్రం 1980లలో వచ్చి పెద్ద హిట్టైన The Gods Must Be Crazy అనే చిత్రం మెయిన్ థీమ్‌ని తీసుకొని తెర‌కెక్కిస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈగ‌, బాహుబ‌లి చిత్రాల‌కి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పని చేసిన అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఆకాశ‌వాణి చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమాలో ఆకాశం నుండి ఓ రేడియో గిరిజన తెగ ఉండే అడవిలో పడటం..అక్కడ నుంచి వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పులతో ఫన్నీగా సాగుతుంద‌ట‌. ఈ చిత్ర క‌థ దాదాపు ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ చిత్ర కాన్సెప్ట్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని అంటున్నారు. ఇందులో ఓ కోకోకోలా బాటిల్ ని ఓ ప్లైట్ లో పై నుంచి క్రిందకు విసరేయటంతో అది వచ్చి ..కల్హారి ఎడారిలో పడుతుంది. అక్కడుండే తెగ..వాళ్లు ఎప్పుడూ అలాంటి బాటిల్ ఒకటి ఉంటుందని వినకపోవటం, చూడకపోవటంతో చాలా ఆశ్చర్యపోతారు. అక్కడ నుంచి ఆ బాటిల్ తో రకరకాల సమస్యలు వస్తాయి. మ‌రి ఆకాశ‌వాణి చిత్రం హాలీవుడ్ చిత్ర క‌థ‌ని పోలీ ఉంటుందా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

1319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles