అత్యధిక ఆదాయం అందుకుంటున్న అక్షయ్: ఫోర్బ్స్

Thu,August 22, 2019 02:47 PM
akshay gets top remunaration indian film industry

ముంబై: భారతీయ నటుల్లో అత్యధిక పారితోషికం పొందుతున్న నటుడు అక్షయ్ కుమార్ అని ఫోర్బ్ మేగజైన్ వెల్లడించింది. 2019 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ మేగజైన్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల వివరాలు తెలియజేసింది. ఓవరాల్‌గా చూస్తే హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 89.4 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, క్రిస్ హెమ్స్‌వర్త్ 76.4 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

బాలీవుడ్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అక్షయ్ కుమార్ 65 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. జాకీ చాన్ ఐదో స్థానంలో ఉండగా, భారతీయ నటుల్లో అక్షయ్ ఒక్కడే టాప్ టెన్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. మొత్తంగా చూసినైట్లెతే, భారత్ తరఫున అక్షయ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2018 జూన్ 1 నుంచి 2019 జూన్ 1 వరకు ఆయా నటుల సంపదను లెక్కించినట్లు ఈ సందర్భంగా ఫోర్బ్స్ తెలిపింది.

2515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles