అక్ష‌య్ ప‌నికి అవాక్క‌వుతున్న నెటిజ‌న్స్

Wed,August 14, 2019 10:47 AM
Akshay Kumar funny thing makes laugh

ఖిలాడీ కుమార్ అక్ష‌య్ కుమార్ న‌టించిన తాజా చిత్రం మిష‌న్ మంగ‌ళ్‌. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న ఈ కార్య‌క్ర‌మంకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. తాజాగా చిత్ర ప్ర‌ధాన పాత్ర‌ధారులు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూవీకి సంబంధించిన విశేషాలు షేర్ చేసుకున్నారు. అయితే ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ఓ రిపోర్ట‌ర్ మాట‌లు రికార్డ్ చేసేందుకు మొబైల్‌ని ఉంచాడు. మొబైల్ సైలెంట్‌లో పెట్ట‌క‌పోవ‌డంతో మ‌ధ్య‌లో మోగింది. వెంట‌నే అక్ష‌య్ ఫోన్ లిఫ్ట్ చేసి .. మేం విలేక‌రుల స‌మావేశంలో ఉన్నాం. నేను అక్ష‌య్ కుమార్‌ని మాట్లాడుతున్నాను. త‌ర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ క‌ట్ చేశారు. ఇది చూసిన మిగ‌తా స్టార్స్ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. అక్ష‌య్ స‌మ‌య‌స్పూర్తిపై నెటిజ‌న్స్ కూడా ప్ర‌శంలు కురిపిస్తున్నారు.

అద్భుత అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌తో త‌న ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాపింప చేస్తున్న ఇస్రో మంగ‌ళ్‌యాన్ మిష‌న్‌ను చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆ క‌థాంశంతో రూపొందిన మిష‌న్ మంగ‌ళ్ రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది . ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది.ఈ మూవీలో అక్ష‌య్‌కుమార్.. రాకేశ్ ధావ‌న్ శాస్త్ర‌వేత్త పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇక మ‌రో శాస్త్ర‌వేత్త తారా షిండే పాత్ర‌ను విద్యాబాల‌న్ పోషిస్తున్న‌ది. ఈ చిత్రాన్ని డైర‌క్ట‌ర్‌ జ‌గ‌న్ శ‌క్తి తెర‌కెక్కిస్తున్నారు. తాప్సీ, విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

1563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles