కాంచ‌న రీమేక్‌లో అక్ష‌య్.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sat,May 18, 2019 12:24 PM
akshay kumar kanchana remake first look released

ముని సిరీస్‌కి సీక్వెల్‌గా వ‌చ్చిన కాంచ‌న చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2011లో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కుడు లారెన్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోను రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ‌ర‌త్ కుమార్ పాత్ర కోసం ప‌లువురు ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోల‌తో లారెన్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.ఇక క‌థానాయిక‌గా భ‌ర‌త్ అనే నేను ఫేం కియారా అద్వానీని ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న‌ ఈ చిత్రానికి ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్ ఖరారు చేసి ఫ‌స్ట్ లుక్ వదిలారు. ఇందులో అక్ష‌య్ కంటికి కాజ‌ల్ పెట్టుకున్న‌ట్టుగా ఉంది. ఫ‌స్ట్ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. జూన్ 5, 2020న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. మ‌రోవైపు అక్ష‌య్ ..రోహిత్ శెట్టి డైరెక్ష‌న్‌లో సూర్యవంశీ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. 2020 ఈద్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

1347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles