ఖవ్వాలితో తలపడబోతున్న అక్షయ్, రానా

Wed,August 21, 2019 06:05 PM
Akshay Kumar, Rana Daggubati to Get a Qawwali Face-Off in Housefull 4

ముంబై: బాలీవుడ్ స్టార్ అక్షయ్, బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటించబోతున్నారు. అక్షయ్ కుమార్ కామెడీ సీక్వెల్ హౌస్‌ఫుల్ 4లో రానాకు కీలకపాత్ర లభించినట్టు సమాచారం. ఈ సినిమాకు ఫర్హాద్ సాంజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీలక సమయంలో వీరిద్దరూ ఖవ్వాలీ కళాకారులుగా పోటీపడనున్నారు. అక్టోబరులో విడుదల కానున్న ఈసినిమా షూటింగ్ ఆగస్టు చివరిలో ప్రారంభమవుతుంది. దీనికి ముందు చేసిన హౌస్‌ఫుల్ సీక్వెల్స్ అన్నీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇంకా ఈ మూవీలో బాబీ డియోల్, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే, రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్రల్లో నటించనున్నారు.

1168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles