ఆటోవాలా పనికి ఫిదా అయిన అక్ష‌య్ కుమార్

Wed,September 18, 2019 01:22 PM

ప్ర‌స్తుతం దేశ‌మంత‌టా గ్రీన్ ఛాలెంజ్ న‌డుస్తుంది. మొక్క‌ల‌ని నాటండి.. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడండి అంటూ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు పిలుపునిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ఆటోవాలా త‌న ఆటో చుట్టూ మొక్క‌ల కుండీల‌ని అలంక‌రించాడు. ఇది అక్ష‌య్ కుమార్ కంట ప‌డ‌డంతో వెంట‌నే ఆటో ఫోటోలని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ప‌చ్చ‌ద‌నం మీ దృష్టిని ఆక‌ర్షిస్తుంది. నేను షూట్‌లో పాల్గొనేందుకు వెళుతున్న స‌మ‌యంలో ఓ ఆటో రిక్షా చుట్టూ మొక్క‌ల‌తో క‌ప్ప‌బ‌డి ఉంది. ఈ ఆహ్లాదకరమైన దృశ్యాన్ని చూసి చాలా సంతోషించాను. అత‌నిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ప‌ర్యావ‌ర‌ణం కోసం అత‌ను చేసిన ప్ర‌య‌త్నం అభినందించ‌ద‌గిన‌ది అని అక్ష‌య్ పేర్కొన్నారు. రీసెంట్‌గా మిష‌న్ మంగళ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అక్ష‌య్ ప్ర‌స్తుతం చారిత్రాత్మక చిత్రం ‘పృత్విరాజ్’ చిత్రంతో పాటు కాంచ‌న రీమేక్ ( ల‌క్ష్మీ బాంబ్‌) , హౌజ్‌ఫుల్ 4, సూర్య‌వంశీ చిత్రాలు చేస్తున్నాడు.

3355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles