అక్ష‌య్ దేశ‌భ‌క్తిని శంకించాల్సిన ప‌నిలేదు

Wed,May 8, 2019 12:46 PM
Akshay Kumar thanks Kiren Rijiju for supporting him

బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కి కెన‌డా పౌర‌స‌త్వం ఉంద‌ని, ఈ కార‌ణంగానే ఇటీవ‌ల జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో ఓటు కూడా వేయ‌లేదని నెటిజన్స్ ఆయ‌న‌ని తెగ ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన అక్ష‌య్ గత ఏడేళ్ళుగా ఒక్కసారి కూడా కెనడా వెళ్లలేదని, దీనిని రాద్ధాంతం చేయోద్ద‌ని కోరారు. ఇండియా ప్ర‌గ‌తి ప‌థంలో వెళ్ళ‌డానికి తాను ఎంతో కృషి చేస్తున్న‌ట్టు కూడా అక్ష‌య్ పేర్కొన్నారు. అయితే ప‌లువురు అక్ష‌య్ కుమార్‌కి మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌గా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజ్జూ కూడా అక్ష‌య్‌కి స‌పోర్ట్ చేశారు. అక్షయ్‌ దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నారు కిరెన్‌.

ప్రియ‌మైన అక్ష‌య్ కుమార్.. మీ దేశ‌భ‌క్తిని ఎవరు శంకించ‌లేరు. సాయిధ ద‌ళానికి చెందిన సిబ్బంది చ‌నిపోయిన‌ప్పుడు మీరు స్పందించిన తీరు .. భార‌త్ కే వీర్ కార్య‌క్ర‌మం ద్వారా మీరు విరాళాలు సేక‌రించిన విధానం దేశంపై మీకున్న భ‌క్తిని తెలియ‌జేస్తుంది అని త‌న ట్వీట్‌లో తెలిపారు కిరెన్ రిజ్జూ. ఆయ‌న ట్వీట్‌కి స్పందించిన అక్ష‌య్ కిరెన్‌కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మీకు ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డంలో కాస్త ఆల‌స్యం అయినందుకు క్ష‌మించండి మీరు నాపై కురిపించిన ప్రేమ‌కి ధ‌న్యుడిని. భారత ఆర్మీ పట్ల, ‘భారత్‌కేవీర్‌’ కార్యక్రమం పట్ల నా బాధ్యత ఎప్పటికి స్థిరంగా నిలిచి ఉంటుందని అక్ష‌య్ అన్నారు. బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్ రీసెంట్‌గా పోని తుపాను బాధితుల‌కి కోటి రూపాయ‌లు విరాళం అందించిన సంగ‌తి తెలిసిందే.


970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles