అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న‌ నాలుగో వ్య‌క్తిగా అక్ష‌య్

Thu,August 22, 2019 12:57 PM
Akshay Kumar worlds 4th highest paid actor

2019 సంవ‌త్స‌రానికి గాను ఫోర్బ్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత పారితోషికం తీసుకుంటున్న ప్రముఖుల లిస్ట్‌ని కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. ఇందులో భారత్ నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు మాత్రమే చోటు దక్కింది. 65 మిలియ‌న్ డాల‌ర్స్‌తో ఆయ‌న నాలుగో స్థానంలో నిలిచారు. డ్వైన్ జాన్స‌న్ ( $89.4 మిలియ‌న్ డాలర్స్) తో తొలి స్థానం ద‌క్కించుకోగా, రెండో స్థానంలో థోర్ స్టార్ ( $76.4 మిలియ‌న్), మూడో స్థానంలో ఐర‌న్ మ్యాన్ రోబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్‌( $66 మిలియ‌న్ ) ఉన్నారు. జాకీ చాన్‌( $58 మిలియ‌న్), బ్లాడ్లీ కూప‌ర్( $57 మిలియ‌న్‌), ఆడ‌మ్ సాండ్ల‌ర్‌( $57 మిలియ‌న్‌), క్రిస్ ఎవాన్స్‌( $43.5 మిలియ‌న్‌), పాల్ రుడ్డ్‌( $41 మిలియ‌న్), విల్ స్మిత్ ($ 35 మిలియ‌న్) 5,6,7,8,9,10 స్థానాల‌లో నిలిచారు. తాజా లెక్క‌ల‌ని బ‌ట్టి 51 ఏళ్ల అక్ష‌య్ ఒక చిత్రానికి కనీసం 5 నుండి 10 మిలియన్ల వరకు వసూలు చేస్తాడని ఫోర్బ్స్ చెబుతుంది. అంతేకాకుండా 20 కి పైగా ఉన్న‌ ఎండార్స్‌మెంట్ ఒప్పందాల నుండి అత‌ను మిలియన్లను సంపాదించాడని చెబుతున్నారు.1678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles