అభిమానులకు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిన అక్షయ్

Mon,September 9, 2019 02:34 PM

ముంబయి: బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ నేడు 52వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు పుట్టిన రోజు కానుకగా తను నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘పృత్విరాజ్’ సినిమా టీజర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు. అక్షయ్ మాట్లాడుతూ.. పుట్టిన రోజు సందర్భంగా తన జీవితంలో నటిస్తున్న ముఖ్యమైన సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.


పృత్విరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం తన జీవితంలోనే ప్రత్యేకమని అక్షయ్ అన్నారు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles