ఓ వైపు ఆందోళనలు..ముంబై మెట్రోలో అక్షయ్..వీడియో

Thu,September 19, 2019 04:21 PM


ముంబై మెట్రోలో స్టార్ యాక్టర్ అక్షయ్ కుమార్ ప్రత్యక్షమయ్యాడు. అక్షయ్‌కుమార్ షూటింగ్ తర్వాత తక్కువ సమయంలో ఇంటికి చేరుకునేందుకు మెట్రోరైలు ఎక్కాడు. ముంబై-వెర్సోవాకు 13 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు నా ప్రయాణానికి 2 గంటల 5 నిమిషాలు పట్టనున్నట్లు మ్యాప్‌లో చూపించింది. ఇవాళ మెట్రో రైలులో నా రైడ్. ట్రాఫిక్ అత్యంత ఎక్కువగా ఉండే సమయంలో ఘాట్‌కోపర్ నుంచి వెర్సోవా వరకు ఓ బాస్‌లాగా ప్రయాణం చేశానంటూ..ముంబై మెట్రో ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు అక్షయ్.


బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ తర్వాత ముంబై మెట్రోను ప్రశంసించిన యాక్టర్లలో అక్షయ్‌కుమార్ రెండోవ్యక్తి. ముంబైలోని ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ కోసం సుమారు
2700 చెట్లు నరికివేస్తుండటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అక్షయ్‌కుమార్ ముంబై మెట్రోను ప్రశంసించడం చర్చనీయాంశమైంది.


2632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles