రెండో వివాహానికి సిద్ధ‌మైన అమ‌లాపాల్ మాజీ భ‌ర్త‌

Sun,June 30, 2019 10:59 AM
Al Vijay second marriage with Aishwarya

త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ మ‌రోసారి పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మ‌య్యాడు. జూన్ 12, 2014న‌ అమ‌లాపాల్‌ని వివాహం చేసుకున్న విజ‌య్ ప‌లు కార‌ణాల వ‌ల‌న 2017లో ఆమెకి డైవ‌ర్స్ ఇచ్చాడు. కొద్ది రోజులుగా విజ‌య్ రెండో పెళ్ళికి సంబంధించి ప‌లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్ట‌గా తాజాగా ఆయ‌న మ‌రో పెళ్ళి చేసుకోబోతున్నట్టు ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు. చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని ఆయన వివాహమాడబోతున్నట్టు తెలిపాడు. జీవితంలో మ‌నం చేసే ప్ర‌యాణాలు ప్ర‌త్యేకంగా ఉంటాయి. ప్ర‌తి ఒక్కరి జీవితంలో మాదిరిగానే నా జీవితంలోను బాధ‌, సంతోషం, జ‌యాలు, అప‌జయాలు ఉన్నాయి. అన్ని సంద‌ర్భాల‌లో మ‌ద్దతుగా నిలిచింది మీడియా వ‌ర్గాలే. వారిని స్నేహితులు అన‌డం కంటే కుటుంబ స‌భ్యులు అంటే బాగుంటుంది. నా భావోద్వేగాల‌ని అర్ధం చేసుకొని, ప్రైవ‌సీని గౌరవించి మ‌ళ్ళీ కోలుకునేలా చేశారు. ఐశ్వ‌ర్య‌తో నా వివాహం త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నుంది. ఇది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. జూలైలో నా కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహం జ‌ర‌గ‌నుంది. మీ అంద‌రి ఆశీర్వాదాల‌తో జీవితంలో కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌బోతున్నాను అని విజ‌య్ పేర్కొన్నారు. ఏఎల్ విజ‌య్ ప్ర‌స్తుతం దేవి 2 చిత్రంతో పాటు జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు. హిందీ, త‌మిళంలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో కంగనా ర‌నౌత్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హిందీలో ‘జయ’ టైటిల్‌తో, తమిళంలో ‘తలైవి’ టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కానుంది.


2934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles