బాలీవుడ్‌లో టాప్ హీరో చిత్రంలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకున్న అలీ

Sun,April 21, 2019 07:32 AM
ali gets a chance in dabaang 3

ఎలాంటి స‌పోర్ట్ లేకుండా అతి చిన్న వ‌య‌స్సులోనే ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా, క‌మెడీయ‌న్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకున్నారు అలీ. ఆయ‌న భాష, వేషం చూస్తే ఎవ‌రికైన న‌వ్వు రావ‌ల్సిందే . ప్ర‌స్తుతం హోస్ట్‌గాను బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్నారు అలీ.అయితే ఆయ‌నకి బాలీవుడ్‌లో స‌ల్మాన్ చిత్రంలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. స‌ల్మాన్ ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ సిరీస్ ద‌బాంగ్‌లో భాగంగా ద‌బాంగ్ 3 చిత్రం చేస్తున్నాడు. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సుదీప్ విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలీకి అవ‌కాశం రావ‌డం గొప్ప విష‌య‌మే. కానిస్టేబుల్ పాత్ర‌లో అలీ సంద‌డి చేయ‌నున్నాడు. రీసెంట్‌గా టీంతో క‌లిసిన అలీ సెట్‌లో స‌ల్మాన్‌తో క‌లిసి ఫోటో దిగాడు. ఇందులో అలీ ఫ్యామిలీ కూడా ఉన్నారు . ఈ చిత్రం త‌ర్వాత అలీకి బాలీవుడ్‌లోను మరిన్ని ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు.

2520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles