అలియా భ‌ట్ మిడ్‌నైట్ బ‌ర్త్‌డే బాష్‌

Fri,March 15, 2019 10:08 AM
Alia Bhatt celebrates birthday with close friends

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ అర్ధ‌రాత్రి త‌న బ‌ర్త్‌డే వేడుకల‌ని స్నేహితులు, స‌న్నిహితుల మ‌ధ్య గ్రాండ్‌గా జ‌రుపుకుంది. నేటితో అలియా భ‌ట్ 26వ ప‌డిలోకి అడుగిడింది.అలియా బ‌ర్త్‌డే పార్టీలో డిజైన‌ర్ మ‌స‌బ గుప్తా, చిన్న‌నాటి స్నేహితురాలు అనుష్క రంజ‌న్‌తో పాటు ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.ప్ర‌స్తుతం అలియా భ‌ట్ బ‌ర్త్‌డేకి సంబంధించిన కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. క‌ర‌ణ్ జోహార్ డ్రీమ్ ప్రాజెక్ట్ క‌ళంక్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్న అలియా భ‌ట్ బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రం చేస్తుంది. ఈ మూవీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. త‌క్త్ అనే చిత్రంలోను న‌టిస్తుంది అలియా. రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌లో చ‌రణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా కూడా న‌టిస్తుంది అలియా భ‌ట్. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌నున్న‌ట్టు టాక్.1989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles