ర‌ణ్‌బీర్‌కి ఐలవ్ యూ చెప్పిన అలియా

Sun,March 24, 2019 10:43 AM
Alia Bhatt says I love you to Ranbir Kapoor

బాలీవుడ్‌లో ప్రేమ‌,పెళ్ళిళ్ళ హంగామా జోరుగా న‌డుస్తుంది. గ‌త ఏడాది ప్రేమ‌లో ఉన్న కొంద‌రు సెల‌బ్రిటీలు పెళ్ళి పీట‌లెక్కారు. మరి కొంద‌రు ఇప్ప‌టికీ ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. అయితే బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ పెయిర్ ర‌ణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్‌లు కొన్నాళ్ళ నుండి ప్రేమాయ‌ణంలో ఉన్న సంగతి తెలిసిందే. వారి ప్రేమ‌కి సంబంధించి ప‌లు సార్లు ఇన్‌డైరెక్ట్‌గా హింట్ కూడా ఇచ్చారు. మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్లి పీట‌లెక్క‌నున్న ఈ జంట ఇటీవ‌ల జ‌రిగిన ఫిలిం ఫేర్ అవార్డు వేడుక‌లలో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ర‌ణ్‌బీర్ క‌పూర్ సంజూ చిత్రానికి ఉత్త‌మ న‌టుడు అవార్డు అందుకోగా, అలియా భ‌ట్ రాజీ చిత్రానికి గాను ఉత్తమ న‌టి అవార్డు గెలుచుకుంది.

రాజీ చిత్రానికి గాను ఉత్త‌మ న‌టి అవార్డు అందుకున్న స‌మ‌యంలో అలియా మాట్లాడుతూ.. మేఘ‌నా.. ఈ అవార్డు మీది. మీ క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ఇది. విక్కీ నువ్వు లేనిది రాజీ లేదు. నా మెంట‌ర్ క‌ర‌ణ్ జోహార్‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అక్క‌డ నాకు సంబంధించి ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి ఉన్నారు. ఐ ల‌వ్ యూ ర‌ణ్‌బీర్ అంటూ మ‌న‌సులోని మాట‌ని బ‌య‌ట‌పెట్టేసింది అలియా. ఈ అమ్మ‌డు ఆ మాట చెప్ప‌గానే కెమెరాస్ అన్నీ ర‌ణ్‌బీర్ వైపుకి తిర‌గ‌గా ఆయ‌న సిగ్గుతో మొఖాన్ని చేతుల‌తో క‌వ‌ర్ చేసుకున్నాడు. అతి త్వ‌ర‌లోనే ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్‌లు పెళ్లి పీట‌లు ఎక్కనున్నార‌ని బాలీవుడ్ జ‌నాలు అంటున్నారు.

2328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles