గ్యాంగ్‌స్ట‌ర్ నేప‌థ్యంలో అలియా భ‌ట్ చిత్రం

Thu,October 17, 2019 08:51 AM

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తుంది అలియా. ఈ చిత్రంతో పాటు బ్ర‌హ్మాస్త్రా ,కళంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 అనే చిత్రాలు చేస్తుంది. ఇక సంజ‌య్ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఇన్షా అల్లా అనే చిత్రంలో సల్మాన్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపికైంది అలియా భ‌ట్. అయితే ఈ సినిమా ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆగిపోవ‌డంతో సంజ‌య్ గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.


అలియా భట్‌ లీడ్‌ రోల్‌లో ‘గంగూభాయ్‌ కతియవాడి’ అనే సినిమా తెరకెక్కించ‌నున్నాడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ . ఈ సినిమా అధికారిక ప్రకటన తాజాగా వెల్లడైంది. జ‌యంతిలాల్ గ‌డా అనే పాత్రికేయురాలు రాసిన ఓ బుక్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్‌ సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబరు 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాతో ముంబై గ్యాంగ్‌స్టర్‌గా కొత్త అవతారం ఎత్తనుంది బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌. చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles