ఎవ‌రు చిత్రంపై బ‌న్నీ ప్ర‌శంస‌లు

Tue,August 20, 2019 09:40 AM
allu arjun praise evaru movie

క్ష‌ణం, గూఢచారి వంటి అభిరుచి గల కథాంశాల్నిఎంచుకొని చక్కటి విజయాల్ని అందుకున్న‌ అడవి శేష్ మ‌రోసారి థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఎవ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. చిత్రంలో కావాల్సినంత ఉత్కంఠతో పాటు కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో అబద్దాలు ఎవరిని దోషిగా తేల్చాయన్నది ఆకట్టుకునే అంశంగా మిగిలిపోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ మూవీపై విమ‌ర్శ‌కుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ రీసెంట్‌గా ఎవ‌రు చిత్రాన్ని వీక్షించార‌ట‌. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో ట్విస్ట్‌లు ఎంతో థ్రిల్ ఇచ్చాయ‌ని సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. టెక్నిక‌ల్ పాయింట్స్ బాగున్నాయి. శేషు ఎంచుకున్న ప్రాజెక్టులు ఆయ‌న‌కి మంచి స్టార్‌డంని అందిస్తున్నాయి. రెజీనా, న‌వీన్ చంద్ర‌, ముర‌ళీ శ‌ర్మ‌తో పాటు ప‌లువురు న‌టీన‌టులు చ‌క్క‌ని ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చారు. చివ‌రిగా కెప్టెన్ వెంక‌ట్ రామ్‌జీ షిప్‌ని అద్భుతంగా నడిపించారు అని బ‌న్నీ పేర్కొన్నారు.


874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles