బ‌న్నీ బ్ర‌ద‌ర్ రిసెప్ష‌న్‌లో సంద‌డి చేసిన మెగా ఫ్యామిలీ

Fri,July 19, 2019 11:57 AM
Allu Bobby Wedding Video

దిగ్గ‌జ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ వివాహం జూన్ 21న హైదరాబాద్‌లోని ఐటిసి కోహినూర్ హోటల్లో నిరాడంబంరంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నీలు షా అనే యోగా ట్రైన‌ర్‌ని ఆయ‌న వివాహం చేసుకున్నారు. ఈ శుభ‌కార్యానికి కొద్ది మంది మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. అయితే తాజాగా గ్రాండ్ రిసెప్ష‌న్ వేడుక‌ని అల్లు ఫ్యామిలీ నిర్వ‌హించ‌గా ఈ కార్యక్ర‌మానికి మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్, బ‌న్నీ, శిరీష్‌, వ‌రుణ్ తేజ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. బాబీ రిసెప్ష‌న్‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇదిలా ఉంటే బాబీ శ్రీమ‌తి నీలు షాది ముంబై కాగా, ఆమె హైద‌రాబాద్‌లో సెటిలైంది. పుణేలోని సింబయాసిస్ నుండి ఎంబీఏ పూర్తి చేసిన నీలు ..తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు. వీరిరివురిది ప్రేమ వివాహం అని అంటున్నారు. బాబీకి కొన్నేళ్ళ క్రిత‌మే పెళ్లి కాగా ప‌లు కార‌ణాల వ‌ల‌న మొద‌టి భార్య‌తో విడాకులు తీసుకున్నార‌ట‌. వారికి ఓ కుమార్తె కూడా ఉన్నారు. బాబీ త్వ‌ర‌లో నిర్మాత‌గా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప‌లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.


2542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles