శిరీష్ ప్రాజెక్ట్ క‌ళ్యాణ్ రామ్ చేతిలోకి..!

Sat,March 23, 2019 12:32 PM
allu sirish project goes into kalyan rams hand

అల్లు శిరీష్‌, క‌ళ్యాణ్ రామ్ వీరిద్ద‌రు స్టార్ ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికి స‌రైన స‌క్సెస్‌లు సాధించ‌లేక‌పోతున్నారు. క‌ళ్యాణ్ రామ్ రీసెంట్‌గా 118 అనే థ్రిల్ల‌ర్ మూవీతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక అల్లు శిరీష్ ఏబీసీడీ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌నే కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు శిరీష్‌. అయితే కొత్త దర్శకుడు మల్లిడి వేణు.. ఇటీవ‌ల అల్లు శిరీష్‌ని క‌లిసి ఫాంట‌సీ స‌బ్జెక్ట్‌ని వివ‌రించాడ‌ట‌. క‌థ నచ్చిన‌ప్ప‌టికి భారీ బ‌డ్జెట్ అవుతుంద‌నే భావ‌న‌లో ఆ ప్రాజెక్ట్‌లో న‌టించేందుకు నో చెప్పాడ‌ట‌.వెంట‌నే వేణు అదే క‌థ‌ని క‌ళ్యాణ్ రామ్‌కి వివ‌రించ‌గా , ఆయ‌న తన సొంత బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై ఈ ఫాంట‌సీ సినిమాని నిర్మించాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి తుగ్ల‌క్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌ ద‌శ‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని చెబుతున్నారు .

1720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles