అమ‌లాపాల్‌ని ఇబ్బందుల్లోకి నెట్టిన కారు రిజిస్ట్రేష‌న్

Thu,January 11, 2018 11:01 AM

కేర‌ళ‌లో నివ‌సిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్న‌ట్టు త‌ప్పుడు చిరునామా ప‌త్రాన్ని చూపి ల‌గ్జ‌రీ కారు కొన్న‌దంటూ అమ‌లాపాల్‌పై పలు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రూ.20 ల‌క్ష‌లు ఎగ్గొట్టి చ‌ట్ట వ్య‌తిరేఖ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన అమ‌లాపాల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడి అప్ప‌ట్లో ఆదేశించారు. దీనిపై కేరళా పోలీసులు అమలాపాల్‌పై పన్ను ఎగవేత కేసుని నమోదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఈ హీరోయిన్‌కి నోటీసులు జారీ చేసినా.. సరైన స్పందన లేకపోవడంతో తాజాగా పోలీసులు హైకోర్టుని ఆశ్ర‌యించారు. అయితే త‌న‌ని అరెస్ట్ చేస్తారేమోన్న భ‌యంతో ముంద‌స్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటీష‌న్ దాఖలు చేసింది. దీనిని విచారించిన న్యాయ‌స్థానం బెయిల్‌ని కొట్టేస్తూ.. జ‌న‌వ‌రి 15న పోలీసుల ముందు హాజ‌రవ్వాల‌ని ఆదేశించింది. అంతేకాదు కారు కొనుగోలు, నకిలీ ఆధారాలతో రిజిస్ట్రేషన్‌, ట్యాక్స్‌ ఎగొట్టిన వ్యవహారాలపై తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరై స్టేషన్‌లో వివరణ ఇవ్వాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. గ‌తంలో ప‌లువురు స్టార్ సెల‌బ్రిటీలు కూడా ఇలానే రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ప్ప‌టికి, వారెవ‌రి గురించి ఆరా తీయ‌ని ప్ర‌భుత్వం అమ‌లాపాల్‌పై ఎందుకు ఫోక‌స్ చేసిందా అని కోలీవుడ్‌లో జోరుగా చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. అమలా పాల్ నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ త్వరలో విడుదల కానుంది.

3578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles