త‌న మాజీ భ‌ర్త సంతోషంగా ఉండాల‌ని కోరిన అమ‌లా పాల్‌

Tue,July 16, 2019 10:42 AM
Amala Paul reacts to ex husband AL Vijays marriage

త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ జూన్ 12, 2014న‌ అమ‌లాపాల్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌లు కార‌ణాల వ‌ల‌న మార్చి 3, 2015 నుండి వారు విడివిడిగా ఉన్నారు . 2017లో అఫీషియ‌ల్‌గా విడిపోయారు . రీసెంట్‌గా విజ‌య్ .. చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని వివాహ‌మాడాడు. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో విజ‌య్ వివాహం జ‌రిగింది. ప‌లువురు ప్ర‌ముఖులు విజ‌య్ దంప‌తుల‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. అమ‌లాపాల్ ఓ వైబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. విజ‌య్ మంచి వ్య‌క్తి. ఆయ‌న వైవాహిక జీవితం మంచిగా ఉండాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దంప‌తులు ఎక్కువ సంతానంతో సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు పేర్కొంది. ఇక విడాకుల త‌ర్వాత నాకు స‌పోర్టింగ్ రోల్స్ మాత్ర‌మే వ‌స్తాయ‌ని అనుకున్నాను. అక్క‌, చెల్లి, ఫ్రెండ్, వ‌దిన వంటి పాత్ర‌ల‌లో చేయాల్సి వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డ్డాను. టీవీ సీరియ‌ల్స్‌కే ప‌రిమితం కావ‌ల్సి వ‌స్తుందేమోన‌ని ఊహించాను. కాని ప్ర‌తిభ ఉంటే మ‌న‌ల్ని ఎవ‌రు అడ్డుకోలేర‌ని తెలిసింది అని అమలా పాల్ పేర్కొంది. అమ‌లా పాల్ న‌టించిన థ్రిల్ల‌ర్ చిత్రం ఆడై జూలై 19న విడుద‌ల కానుంది. తెలుగులో ఈ చిత్రం ఆమె పేరుతో రిలీజ్ కానుంది. ఇక ఏఎల్ విజ‌య్ ప్ర‌స్తుతం దేవి 2 చిత్రంతో పాటు జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు. హిందీ, త‌మిళంలో విడుల కానున్న ఈ చిత్రంలో కంగనా ర‌నౌత్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హిందీలో ‘జయ’ టైటిల్‌తో, తమిళంలో ‘తలైవి’ టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కానుంది.

1360
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles