పోలీసుల‌కి స‌రెండ‌ర్ అయిన అమ‌లాపాల్‌..!

Wed,January 17, 2018 10:13 AM

కేర‌ళ‌లో నివ‌సిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్న‌ట్టు త‌ప్పుడు చిరునామా ప‌త్రాన్ని చూపి ల‌గ్జ‌రీ కారు కొన్న‌దంటూ అమ‌లాపాల్‌పై పలు ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆమె అరెస్ట్ తప్పదనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు అమ‌లాపాల్ పోలీసుల ముందు లొంగిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రూ.20 ల‌క్ష‌లు ఎగ్గొట్టి చ‌ట్ట వ్య‌తిరేఖ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన అమ‌లాపాల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడి అప్ప‌ట్లో ఆదేశించారు. దీనిపై కేరళా పోలీసులు అమలాపాల్‌పై పన్ను ఎగవేత కేసుని నమోదు చేశారు. సెక్షన్ 430 - 468 - 471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా, అమ‌లా పాల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకుంది. కాని కోర్టు ఈమెను క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.. ఆ తరువాత బెయిల్ గురించి ఆలోచిస్తాం అని చెప్పింది. దానితో చేసేదేం లేక.. అమల తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వద్ద లొంగిపోయింది. గ‌తంలో ప‌లువురు స్టార్ సెల‌బ్రిటీలు కూడా ఇలానే రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ప్ప‌టికి, వారెవ‌రి గురించి ఆరా తీయ‌ని ప్ర‌భుత్వం అమ‌లాపాల్‌పై ఎందుకు ఫోక‌స్ చేసిందా అని మ‌ల్లూవుడ్‌లో జోరుగా చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. అమలా పాల్ నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ త్వరలో విడుదల కానుంది.

3014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles