రెండో వివాహం చేసుకున్న అమ‌లాపాల్ మాజీ భ‌ర్త‌

Fri,July 12, 2019 09:35 AM
Amala Pauls ex husband A L Vijay ties the knot

త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ జూన్ 12, 2014న‌ అమ‌లాపాల్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌లు కార‌ణాల వ‌ల‌న మార్చి 3, 2015 నుండి వారు విడివిడిగా ఉన్నారు . 2017లో అఫీషియ‌ల్‌గా విడిపోయారు . రీసెంట్‌గా ఆయ‌న మ‌రో పెళ్ళి చేసుకోబోతున్నట్టు ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చాడు. చెన్నైకు చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని ఆయన వివాహమాడబోతున్నట్టు తెలిపాడు. ఐశ్వ‌ర్య‌తో నా వివాహం పెద్ద‌లు కుదిర్చిన‌ది. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహం జ‌ర‌గ‌నుంది. మీ అంద‌రి ఆశీర్వాదాల‌తో జీవితంలో కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌బోతున్నాను అని విజ‌య్ పేర్కొన్నారు. అయితే ఏల్ విజ‌య్ .. ఐశ్వ‌ర్య‌ల వివాహం గురువారం చెన్నైలో ప్రైవేట్ ఫంక్ష‌న్‌గా జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. పెళ్లి దుస్తుల‌లో ఉన్న వారికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ వేడుక‌కి కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ఏఎల్ విజ‌య్ ప్ర‌స్తుతం దేవి 2 చిత్రంతో పాటు జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు. హిందీ, త‌మిళంలో విడుల కానున్న ఈ చిత్రంలో కంగనా ర‌నౌత్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హిందీలో ‘జయ’ టైటిల్‌తో, తమిళంలో ‘తలైవి’ టైటిల్‌తో ఈ చిత్రం విడుదల కానుంది.

3292
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles