'ఏబీసీడీ' నుండి వీడియో సాంగ్ విడుద‌ల‌

Mon,April 22, 2019 10:14 AM
America Naa America Lyrical Video released

ఎప్ప‌టి నుండో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ ఈ సారి మంచి హిట్ కొట్టేలా క‌నిపిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దీనికి అమెరికన్‌ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశి’ అనేది ట్యాగ్ లైన్ ఇచ్చాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించారు. సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మాస్టర్ భరత్ ఇందులో నటిస్తుండగా.. నాగబాబు, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌బెన్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు. మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా చిత్రం నుండి అమెరికా నా అమెరికా అంటూ సాగే వీడియో విడుద‌ల చేశారు. జుధా సాండి సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ సాంగ్‌ని బెన్నీ ద‌యాల్‌, సంజిత్ హెగ్డే ఆల‌పించారు . ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.

875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles