స్టార్ హీరో గ్యారేజీలోకి ఖరీదైన కారు..

Mon,April 8, 2019 07:52 PM


బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ గ్యారేజ్‌లోకి మరో ఖరీదైన కారొచ్చింది. బిగ్ బీ ఇటీవలే మెర్సిడెజ్‌ బెంజ్‌ వీ క్లాస్‌ ఎంపీవీ (మల్టీ పర్పస్‌ వెహికిల్‌)ని కొనుగోలు చేశారు. మెర్సిడేజ్‌ బెంజ్‌ వీ క్లాస్‌ ఎంపీవీ కారు ధర ప్రస్తుతం రూ.81.90 లక్షలుగా ఉంది. వీ క్లాస్‌ భారత్‌లోనే అత్యంత ఖరీదైన ఎంపీవీ. ఇలాంటి కారును కొనుగోలు చేసిన మొదటి భారతీయ సెలబ్రిటీ బిగ్ బీయేనట. మెర్సిడెజ్‌ బెంజ్‌ సంస్థ వీ క్లాస్ ఎంపీవీ మోడల్ ను ఈ ఏడాదే భారత్‌లో ప్రవేశపెట్టింది. మెర్సిడెజ్‌ కంపెనీ ప్రతినిధి ఒకరు బిగ్ బీకి కారు అందజేసేందుకు వెళ్లినపుడు తీసిన ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

3954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles