అనారోగ్యం వ‌ల‌న ఫిలిం ఫెస్టివల్‌కి హాజ‌రు కాలేక‌పోయిన బిగ్ బీ

Sat,November 9, 2019 12:35 PM

శుక్ర‌వారం సాయంత్రం 25వ కోల్‌క‌త్తా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ఖాన్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. అయితే ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ వేడుక‌కి హాజ‌ర‌య్యే అమితాబ్ బ‌చ్చ‌న్ అనారోగ్యం కార‌ణంగా హాజ‌రు కాలేక‌పోయార‌ట‌. ఈ విష‌యాన్ని మ‌మ‌తా మీడియాకి తెలిపారు. అమితాబ్ ప్ర‌తిసారి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అవుతారు. కాని ఈ సారి హాజ‌రు కాలేక‌పోయారు. అందుకు కార‌ణం గ‌త రాత్రి నుండి ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. వైద్యులు ఆయ‌న‌ని పూర్తి విశ్రాంతి తీసుకోమ‌న్న కార‌ణంగా అమితాబ్ కార్య‌క్రమానికి అటెండ్ కాలేక‌పోయారు. అమితాబ్ బ‌చ్చ‌న్ లేకుండా ఈ ఫిలిం ఫెస్టివ‌ల్ అసంపూర్ణం అని మ‌మ‌తా పేర్కొన్నారు. ఈ రోజు ఫిలింఫెస్టివ‌ల్‌కి బిగ్ బీ హాజ‌రుకాక‌పోయిన ఆయ‌న మ‌న‌సు ఇక్క‌డే ఉంటుంద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను అని మ‌మ‌తా బెన‌ర్జీ స్ప‌ష్టం చేశారు.


బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కాలేయ సంబంధింత వ్యాధితో అక్టోబ‌ర్ 15 మంగ‌ళవారం తెల్ల‌వారు జామున 3గం.ల‌కి నానావ‌తి ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. నాలుగు రోజులుగా అమితాబ్ ఆసుప‌త్రిలోనే ఉన్నార‌నే స‌రికి అభిమానులు ఎంత‌గానో ఆందోళ‌న చెందారు. ఆయ‌న‌కి ఏమైందో తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. రెగ్యుల‌ర్ చెక‌ప్ కోస‌మే అమితాబ్ వ‌చ్చార‌ని వైద్యులు చెప్ప‌డంతో అభిమానులలో ఆందోళ‌న తొల‌గిపోయింది. శుక్ర‌వారం రాత్రి డిశ్చార్జ్ అయిన అమితాబ్‌ని ఆయ‌న కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్, భార్య జ‌యాబ‌చ్చ‌న్‌లు కారులో ఇంటికి తీసుకెళ్ళారు. తన కాలేయం 75 శాతం దెబ్బతిందని ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. తాను టీబీ, హెపటైటిస్ బి వ్యాధుల నుంచి కోలుకున్నానని కూడా చెప్పారు. ప్ర‌స్తుతం కౌన్‌బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజ‌న్ 11 కార్య‌క్ర‌మంతో బిజీగా ఉన్న అమితాబ్.. సూజిత్ సర్కార్ గులాబో సితాబ్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రంలోను కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల అమితాబ్ సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన విష‌యం తెలిసిందే.

743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles