అమితాబ్ డిశ్చార్జ్‌.. ఆనందంలో ఫ్యాన్స్

Sat,October 19, 2019 08:17 AM

బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కాలేయ సంబంధింత వ్యాధితో మంగ‌ళవారం తెల్ల‌వారు జామున 3గం.ల‌కి నానావ‌తి ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. నాలుగు రోజులుగా అమితాబ్ ఆసుప‌త్రిలోనే ఉన్నార‌నే స‌రికి అభిమానులు ఎంత‌గానో ఆందోళ‌న చెందారు. ఆయ‌న‌కి ఏమైందో తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. రెగ్యుల‌ర్ చెక‌ప్ కోస‌మే అమితాబ్ వ‌చ్చార‌ని వైద్యులు చెప్ప‌డంతో అభిమానులలో ఆందోళ‌న తొల‌గి పోయింది. అయితే శుక్ర‌వారం రాత్రి డిశ్చార్జ్ అయిన అమితాబ్‌ని ఆయ‌న కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్, భార్య జ‌యాబ‌చ్చ‌న్‌లు కారులో ఇంటికి తీసుకెళ్ళారు. తన కాలేయం 75 శాతం దెబ్బతిందని ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ కార్యక్రమంలో వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. తాను టీబీ, హెపటైటిస్ బి వ్యాధుల నుంచి కోలుకున్నానని కూడా చెప్పారు. ప్ర‌స్తుతం కౌన్‌బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజ‌న్ 11 కార్య‌క్ర‌మంతో బిజీగా ఉన్న అమితాబ్.. సూజిత్ సర్కార్ గులాబో సితాబ్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రంలోను కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌ల అమితాబ్ సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన విష‌యం తెలిసిందే.

763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles