అసోం వరదబాధితులకు బిగ్ బీ సాయం

Wed,July 24, 2019 05:40 PM


అసోం: వరదలతో ముంచెత్తుతున్న అసోంకు అండగా నిలిచేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ ముందుకొచ్చారు. అసోం వరద బాధితులను ఆదుకునేందుకు బిగ్ బీ తన వంతుగా రూ.51 లక్షలు విరాళంగా ఇచ్చారు. కుండపోత వర్షాలు, వరదలతో అసోంలో నిరాశ్రయులైన లక్షలాది మంది కోసం నా వంతుగా సహాయం చేశా. సోదరసోదరీమణులారా మీ వంతుగా సీఎం సహాయ నిధికి తోచిన విరాళం అందించాలని బిగ్ బీ విజ్ఞప్తి చేశారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ అసోం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles