మ‌రోసారి సైరా టీంతో క‌ల‌వ‌నున్న బిగ్ బీ..!

Sun,March 10, 2019 10:30 AM

మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌గురువు పాత్ర‌లో అమితాబ్ క‌నిపించ‌నుండ‌గా, గ‌త ఏడాది ఆయ‌న షూటింగ్‌లో పాల్గొన్నారు. అప్పుడు ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన లుక్స్‌తో పాటు చిరు, న‌య‌న‌తార లుక్స్ కూడా విడుద‌ల చేశారు. ఇక ఈ నెల 13 నుండి 16 వ‌ర‌కు అమితాబ్‌కి సంబంధించి మ‌రి కొన్ని స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. దీని కోసం బిగ్ బీ హైద‌రాబాద్‌కి రానున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ శివార్ల‌లో వేసిన భారీ సెట్‌లో జ‌రుగుతుంది. ఈ నెల‌లో జ‌రిపే షూటింగ్‌తో 95 శాతం సినిమా పూర్త‌వుతుంద‌ని అంటున్నారు. ద‌స‌రా కానుక‌గా చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి,త‌మ‌న్నా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తుండ‌గా, ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు.

1615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles