త‌ప్పుడు వృత్తిని ఎంచుకున్నానంటున్న అమితాబ్

Fri,May 3, 2019 12:44 PM

ఇండియ‌న్ సినిమా షెహ‌న్‌షా అమితాబ్ బ‌చ్చ‌న్ ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన చిత్రాల‌తో వెండితెర‌పై అల‌రిస్తూనే ఉన్నారు. చివ‌రిగా బ‌ద్లా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా,ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అయితే అమితాబ్ సినిమాల‌తోనే కాకుండా సోష‌ల్ మీడియాలో ప‌లు ట్వీట్స్ ద్వారా కూడా అభిమానుల‌ని ఆనందింప‌జేస్తుంటాడు. తాజాగా అమితాబ్ చేసిన ఓ ట్వీట్ ఫన్నీగానే కాదు కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌డంతో నెటిజ‌న్స్ ఈ ట్వీట్‌ని తెగ వైర‌ల్ చేస్తున్నారు. మేట‌ర్‌లోకి వెళ్ళే మ‌యూర్ సెజ్పాల్ అనే వ్య‌క్తి త‌న ట్వీట్‌లో ప్ర‌ముఖ టెక్ కంపెనీలు గంట‌కి ఎంత సంపాదిస్తున్నాయో డాల‌ర్స్‌ల‌లో రాసాడు. అమెజాన్ గంట‌కి 28.3 మిలియ‌న్ డాల‌ర్స్‌, ఆపిల్ 27.5 మిలియ‌న్ డాల‌ర్స్ ఇలా త‌దిత‌ర కంపెనీలు ఆదాయాన్ని పొందుతున్న‌ట్టు ట్వీట్‌లో ఉంది. ఈ ట్వీట్‌ని రీ ట్వీట్ చేసిన బిగ్ బీ .. నిజ‌మా? మ‌నం త‌ప్పుడు వృత్తిని ఎంచుకున్న‌ట్టున్నాం అని స‌ర‌దా కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది.2408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles