సింగిల్ ఫ్రేమ్‌లో అమితాబ్ ఫ్యామిలీ

Fri,February 5, 2016 03:02 PM

బాలీవుడ్‌లో అమితాబ్ ఫ్యామిలీకు ప్రత్యేక గుర్తింపు ఉండగా, తాజాగా ఈ ఫ్యామిలీ అంతా కలిసి మాల్ధీవులకు వెళ్ళారు. అందుకు కారణమేంటే ఈ రోజు అభిషేక్ బర్త్‌డే. అందుకే ఆయన బర్త్‌డే వేడుకలను మాల్ధీవులలో జరుపుకోవాలని భావించిన బిగ్ బి ఫ్యామిలీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంలో ఒక షిప్‌లో ప్రయాణిస్తున్న ఫోటోను అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేయగా, ఇందులో అమితాబ్ ఫ్యామిలీ అంతా కలిసి ఉండడం విశేషం.


అభిషేక్ 1976 ఫిబ్రవరి 5న జన్మించగా, నేటితో 40 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐష్ తన భర్తకు వెరైటీగా విషెస్‌ను అందించారు. ఇక మాల్ధీవుల్ టూర్‌ని మస్త్ ఎంజాయ్ చేస్తున్న అమితాబ్ ఫ్యామిలీలో ఆయన భార్య జయాబచ్చన్, కొడుకు కోడలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ , కూతురు శ్వేతా బచ్చన్ నందా, మనవరాలు ఆరాధ్య బచ్చన్‌లు ఉండగా వీరిలో ఒక్క శ్వేతా తప్ప మిగతా వారందరూ వెండితెరపై మెరిసిన వారే కావడం విశేషం.
image

3884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles