బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్.. గర్భం దాల్చిన హీరోయిన్

Sun,March 31, 2019 03:57 PM
Amy Jackson says she is pregnant and expecting her first child in October

ఎవడు, ఐ, 2.0 లాంటి మూవీస్‌లో నటించిన అమీ జాక్సన్ తాను గర్భవతినని ప్రకటించింది. మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయిటౌతో డేటింగ్ చేస్తున్న అమీ.. త్వరలోనే తన తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నది. ఈ మధ్యే జార్జ్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. జార్జ్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అమీ.. తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలిపింది. అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు కూడా చెప్పింది. రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకున్నది. బ్రిటన్‌కు చెందిన జార్జ్ ఓ కుబేరుడు. హిల్టన్, పార్క్ ప్లాజా, డబుల్ ట్రీలాంటి లగ్జరీ హోటల్స్‌ను అతడు నిర్వహిస్తున్నాడు. ఇటు మద్రాసు పట్టణం మూవీతో తెరంగేట్రం చేసిన అమీ జాక్సన్.. తర్వాత హిందీ, తెలుగు సినిమాల్లోనూ నటించింది. బాలీవుడ్‌లో అక్షయ్ సరసన సింగ్ ఈజ్ బ్లింగ్, నవాజుద్దీన్‌తో కలిసి ఫ్రీకీ అలీ సినిమాల్లో పని చేసింది. చివరిగా శంకర్ 2.0 మూవీలో రజనీకాంత్ పక్కన నటించింది. అమీ నటించిన కిక్ 2 మూవీ విడుదలకు సిద్ధమవుతున్నది.

13377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles