విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడి మూవీకి ముహూర్తం ఫిక్స్

Fri,September 28, 2018 11:54 AM
Anand Devarakonda movie launched on october 10

అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ . ఇప్పుడు ఆయ‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. విజ‌య్ సోద‌రుడు ఆనంద్ కొద్ది రోజులుగా ఫిలిం క్రాఫ్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతేకాదు ఫిజికల్‌ ఫిట్‌నెస్ కూడా పెంచుకున్నాడు. ఆనంద్ డెబ్యూ సినిమాని సురేష్‌ బాబు సమర్పణలో యష్‌ రంగినేని, మధుర శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేవీఆర్ మ‌హేంద్ర ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. దొర‌సాని అనే టైటిల్ ఈ చిత్రానికి ప‌రిశీలిస్తుండ‌గా, ఇందులో రాజ‌శేఖ‌ర్ రెండో కూతురు శివాత్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. సినిమా మొత్తం పూర్తి తెలంగాణ నేప‌థ్యంలో ఉంటుంద‌ని స‌మాచారం. అక్టోబ‌ర్ 10న ఈ చిత్రం లాంచ‌నంగా ప్రారంభం కానుంద‌ని టాక్. ద‌ర్శ‌కుడు, హీరో, హీరోయిన్ ముగ్గురు కొత్త వాళ్ళ‌తో రూపొంద‌నున్న ఈ సినిమా ఎంత విజ‌యం సాధిస్తుందో చూడాలి. రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివానీ 2 స్టేట్స్ రీమేక్‌తో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానుండ‌గా, ఇప్పుడు రెండో కూతురు దొర‌సాని అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర కానుండ‌డం విశేషం.

2911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles