అన‌సూయ‌కి మ‌రో మెగా ఆఫ‌ర్..!

Fri,April 26, 2019 09:52 AM
Anasuya Bharadwaj acts in mega hero movies

బుల్లితెర‌పై చ‌క్కని వినోదాన్ని పంచుతూ వెండితెరపై అద్భుత క‌థా చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న భామ అన‌సూయ‌. ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నాగార్జున మరదలు పాత్రలో మెప్పించిన అనసూయ.. ‘క్షణం’లో ఏసీపీ జయగా పవర్‌ఫుల్ పాత్ర‌లో నటించింది. ఆ త‌ర్వాత గాయ‌త్రి అనే చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించింది. గ‌త‌ ఏడాది వచ్చిన ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడు క‌థ‌నం అనే చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో న‌టిస్తుంది. రాజేష్ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్‌లో విడుద‌ల కానుంది.

వెండితెర‌పై న‌టించిన చిత్రాల‌లో రంగ‌స్థ‌లం అన‌సూయ కెరియ‌ర్‌కి మంచి బ్రేక్ ఇచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. రంగ‌మ్మ‌త్త‌గా ఆమె న‌ట‌న అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ప్ర‌స్తుతం 'సచ్చిందిరా గొర్రె', 'కథనం' వంటి చిత్రాల్లో న‌టిస్తున్న అన‌సూయ మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలో క‌నిపించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కీల‌క పాత్ర చేయ‌నున్న అన‌సూయ‌.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలోను న‌టించ‌నుంద‌ట‌. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. అన‌సూయ 2017లో విడుదలైన సాయి ధరమ్ తేజ్ 'విన్నర్'లో ప్రత్యేక గీతంలో సందడి చేసిన సంగ‌తి తెలిసిందే. అలానే వ‌రుణ్ తేజ్ న‌టించిన ఎఫ్ 2 లోను గెస్ట్ పాత్ర‌లో క‌నిపించి అల‌రించింది. మొత్తానికి మెగా ఫ్యామిలీ హీరోలందరిని చుట్టేస్తున్న ఈ భామ రానున్న రోజుల‌లో వారి స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుందా ఏమిటీ అని నెటిజ‌న్స్ చ‌ర్చించుకుంటున్నారు.

3151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles