ఆ సినిమాలో క‌థానాయిక‌ని కాదు: అన‌సూయ‌

Fri,February 1, 2019 08:44 AM
anasuya gives clarity on devearakonda movie

యాంక‌ర్‌గా అల‌రిస్తూనే వెండితెర‌పై సెల‌క్టివ్ పాత్ర‌లు చేస్తున్న అందాల భామ అన‌సూయ‌. రంగ‌స్థ‌లం చిత్రంతో న‌టిగా ఆమె ప్ర‌తిభ‌ని నిరూపించుకుంది. ప్ర‌స్తుతం ప‌లు ఆఫ‌ర్స్ అన‌సూయ‌ని ప‌లకరిస్తుండ‌గా, విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మించ‌నున్న ఓ చిత్రంలో ఆమెని క‌థానాయిక‌గా ఎంపిక చేశార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అందులో ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా న‌టిస్తుండ‌గా, ఆయ‌న ల‌వ‌ర్‌గా అన‌సూయ న‌టిస్తుంద‌ని అన్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చింది అన‌సూయ‌. ప్రస్తుతం ‘కథనం’ మూవీ షూటింగ్‌లో ఉన్న అనసూయ... విజయ్ దేవరకొండ సినిమా విషయమై స్పందించింది. తను తరుణ్‌కి లవర్‌ని కానని.. ఈ చిత్రంలో కీలక పాత్ర మాత్రం పోషిస్తున్నానని తెలిపింది.

ద‌ర్శ‌కుడు త‌రుణ్‌కి ఎప్ప‌టి నుండో హీరోగా చేయాల‌నే ఇంట్రెస్ట్ ఉన్న నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌రకొండ త‌న ప్రొడ‌క్ష‌న్‌లో సినిమా చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగుతుందట. అయితే ఈ చిత్రంలో తరుణ్‌కి జోడిగా ఎవ‌రిని ఎంపిక చేస్తారనే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. నాలుగు క్యారెక్టర్ల మధ్య ఈ సినిమా కథ కొనసాగుతుందని టాక్.

2092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles