అన‌సూయ 'క‌థ‌నం' ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,August 3, 2019 08:46 PM
Anasuya Kathanam Movie Theatrical Trailer

యాంక‌ర్‌గా, న‌టిగా రాణిస్తున్న అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ప్రధాన ప్ర‌ధాన పాత్ర‌లో 'కథనం' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్‌ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ చిత్రాన్ని ది మంత్ర ఎంట‌ర్‌టైన్‌మైంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. ‘క్ష‌ణం, రంగ‌స్థ‌లం’ అనంతరం ‘క‌థ‌నం’తో అనసూయ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ద‌మైంది. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై చాలా ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ధ‌న‌రాజ్ వ‌ల్లే ఈ సినిమాలో న‌టించాన‌ని ట్రైల‌ర్ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో చెప్పుకొచ్చింది అన‌సూయ‌. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.


1368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles